బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆమె ముంబైలోని జుహూలో ఓ శివాలయానికి వెళ్లారు. అక్కడ ఆలయంలో పూజలు చేస్తున్న సమయంలో హీరోయిన్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.
ఆలయంలో ఆమెతో సెల్ఫీ దిగేందుకు బాబాలు సైతం పోటీ పడ్డారు. ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టి ఫొటోలు తీసుకున్నారు.సెల్ఫీల కోసం జనాలు ఎగపడటంతో ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. అది గమనించిన టెంపుల్ సెక్యూరిటీ వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అమీషాతో సెల్ఫీ దిగేందుకు యత్నించిన బాబాను అక్కడి నుంచి లాక్కెల్లారు. ఈ విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/greatandhranews/status/1894967051879404023