రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులు మోహరించి భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఓటర్లు సైతం పోలింగ్ కేంద్రాల వద్దకు వడివడిగా చేరుకుంటున్నారు.ఈ క్రమంలో ఓటు హక్కు కలిగి ఉన్న ఓటర్లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక పిలుపునిచ్చారు.
గురువారం ఉదయం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ సెగ్మెంట్ల గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులందరికీ ఇవాళ ఓటు వేయాలని నేను పిలుపునిస్తున్నాను.తెలంగాణలోని అధ్యాపకులు, గ్రాడ్యుయేట్ల భవిష్యత్తును రూపొందించడంలో.. కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో మీ ఓటు కీలకం. స్పృహతో ఓటు వేయండి, మీ వాయిస్‌ని కౌన్సిల్‌కు తీసుకెళ్లగల అభ్యర్థికి ఓటు వేయండి’ అని పిలుపునిచ్చారు.కాగా, రాష్ట్రంలో మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది.