సింగర్‌గాను, ర్యాపర్‌గాను తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన వ్యక్తి నోయల్. బిగ్ బాస్ సీజన్ 4లో ఓ సభ్యుడని నోయల్ ఉండబోతున్నాడని ఓ వైపు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గతేడాది జనవరిలో నటి ఎస్తర్‌ని వివాహం చేసుకున్న నోయల్ తాము విడిపోతున్నట్టు ప్రకటించడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని నోయల్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘నాకు అధికారికంగా విడాకులు మంజూరు అయ్యాయి. ఎన్నో రోజుల మౌనం వీడి ఈస్తర్‌తోకు నాకు విడాకులు అయ్యాయని ప్రకటిస్తున్నాను. ఇక ఈ విషయాన్ని కోర్టు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
I am Officially Divorced.
Wishing Ester Noronha a great new life ahead!
God bless! pic.twitter.com/7vvx84DUge— Noel (@mrnoelsean) September 1, 2020
దాని కోసమే నేను ఎదురుచూస్తున్నాను. అభిప్రాయ బేధాలు ఏర్పడటంతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఎస్తేర్ నీ కలలు నిజం కావాలని కోరుకుంటున్నా. ఎస్తేర్‌ను గానీ, నా కుటుంబాన్నిగానీ ఈ విషయంలో దయచేసి ఇబ్బంది పెట్టకండి అని అభ్యర్థిస్తున్నా. బాధలో ఉన్నప్పుడు నా పక్కన అండగా నిలబడిన నా కుటుంబం, స్నేహితులు అందరికీ థ్యాంక్స్. దేవుడు ఎప్పుడూ మంచి చేస్తాడు. కొత్త జీవితానికి ప్రారంభించడానికి ఇది మంచి సమయమని భావిస్తున్నా’’ అని నోయల్ పోస్ట్ చేశారు. అలాగే ఈ విషయమై ఎస్తర్ కూడా పోస్ట్ పెట్టింది.