బాలివుడ్ నుంచి టాలివుడ్ కి వెళ్ళిపోయి అక్కడ బిజీ అయిపోయిన హీరోయిన్ ప్రియాంకా చోప్రా. అక్కడ వరుసగా సినిమాలు చేయడమే కాదు అక్కడి సింగర్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది ప్రియాంక. ఇక ఫ్యాషన్ విషయంలో కూడా ప్రియాంక దూకుడుగానే ఉంటుంది. మూడు పదుల వయసు దాటినా సరే ఈ భామ ఫ్యాషన్ విషయంలో చాలా మంది హీరోయిన్స్ ను దాటేస్తుంది.
ఏది చేసినా సరే ధైర్యంగా చేయడం ప్రియాంక కు అలవాటు. పెళ్లి అయినా సరే ఆమె అదే విధంగా వ్యవహరిస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల గ్రామీ అవార్డ్స్ సందర్భంగా ప్రియాంక వేసిన డ్రెస్ తీవ్ర విమర్శల పాలైంది. ఆమె వేసుకున్న డ్రెస్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రియాంకకు జాకెట్ ముక్కలు పంచాలి అంటూ పలువురు కామెంట్ చేసారు కూడా. ఆమె పెళ్లి అయినా సరే పద్దతిగా లేదు అంటూ మండిపడ్డారు.
డ్రెస్ చెత్తగా ఉందని కామెంట్లు కూడా చేసారు. తన భర్తతో కలిసి ఆమె ఆ కార్యక్రమానికి హాజరైంది. దీనిపై బాలివుడ్ నటి హీనా ఖాన్ స్పందించారు. ఇతరుల డ్రెస్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదని, అంత పెద్ద కార్యక్రమంలో అలాంటి డ్రెస్ ధరించాలి అంటే ధైర్యం కావాలని, అది అంత సులభం కాదని అన్నారు. దమ్ముంటే ప్రియాంక డ్రెస్ 10 నిమిషాలు వేసుకోవాలని ఆమె సవాల్ చేసారు. దీనిపై ప్రియాంక తల్లి మధు చోప్రా కూడా స్పందించారు.