కిండపడిన ఆహారాన్ని తీసుకోవడానికి సందేహిస్తున్నారా? మీ సందేహానికి ఇదే సమాధానం..!

-

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు..తినే ఏ పదార్థాన్నైనా వృద్ధా చేయకూడు.. ఒకవేళ తినేసమయంలో పొరపాటున కిందపడితే.. కిందపడిన ఆహారాన్ని తిరిగి తీసుకోవచ్చా లేదా..ఒకవేళ తీసుకుంటే ఎంత సమయం లోపల తీసుకోవాలి, అలా తీసుకోవటం సేఫ్ హేనా మనలో చాలామందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది. సాధరణంగా..బయట ప్రదేశాల్లో అయితే మనం కిందపడినా పెద్దగా పట్టించుకోం..కానీ ఇంట్లో అయితే కిందపడితే తీసుకుంటుంటాం. బయట కూడా ప్యాకడ్ ఐటమ్స్ విషయంలో కిందపడినా తీసుకుంటుంటారు. చిప్స్, లేస్ లాంటివి కిందపడిపోతో వెంటనే తీసుకుంటాం. అంటే మనం అందరం ఒకటే పద్దతి గట్టిగా ఫాలో అవుతాం..పడిన ప్లేస్ కాస్త నీట్ గా ఉన్నా, పడిన వెంటనే తీసుకుంటాం. అంటే చాలా సేపటి క్రితం పడితే ఇక దాన్ని వదిలేస్తాం..అప్పుడే కిందపడితే..మాత్రం తీసుకోవడానికే ట్రై చేస్తాం.

5 సెకండ్స్ ఫేమస్ థీయరీ ప్రకారం.. భూమి నుండి 5-సెకన్ల వ్యవధిలో ఆహార పదార్థాన్ని తీసుకున్నట్లయితే అది కలుషితమైనది కాదు.! అలా తినడానికి సురక్షితం, ఈ సమయ పరిమితిలో సూక్ష్మక్రిములు.. బ్యాక్టీరియా ఆహారాన్ని అంటుకోకుండా.. వినియోగానికి ఖచ్చితంగా సురక్షితంగా ఉంటాయని ఒక సాధారణ నమ్మకం. అందుకే అందరూ తెలియకుండానే..పడిన వ్యవధినిబట్టి తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తారు.

అసలు ఆ ఆహారం తీసుకోవడం సురక్షితమేనా?

ఈ ప్రశ్నకు సాధారణ సమాధానం కాదు అని చెప్పాలి. అపరిశుభ్రంగా ఉన్న నేలపై పడిన ఆహారం 1-సెకనులో కూడా కొంత మొత్తంలో బ్యాక్టీరియాను గ్రహిస్తుంది. వీటిని తినడం వల్ల డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే, ఉపరితలంపై ఎలాంటి బ్యాక్టీరియా ఉందో తెలుసుకోవడానికి మార్గం లేదు. నేల శుభ్రంగా ఉన్నప్పటికీ ఆ స్థలం నుండి ఎంత మంది నడిచారో మీరు చెప్పలేరు. కిచెన్ కౌంటర్ .. సింక్‌లు కూడా మీరు అనుకున్నంత శుభ్రంగా ఉండవు. అవి వివిధ రకాల బ్యాక్టీరియాకు అడ్గాగా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే..ఇవి మీ డస్ట్‌బిన్ కంటే మురికిగా ఉంటాయని చాలా అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా.. 5-సెకన్ల నియమానికి మద్దతు ఇవ్వడానికి శాస్త్రీయ అధ్యయనం లేదు. కాబట్టి, మీరు నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.

ఎవరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి?

ప్రస్తుత పరిస్థితుల్లో.. అందరూ COVID-19తో పోరాడుతున్నారు.. నేలపై నుంచి తీసిన ఆహారాన్ని తినడం మరింత ప్రమాదకరం. కరోనావైరస్ అనేది అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి ఇది కలుషితమైన ఏరోసోల్ కణాలను పీల్చడం ద్వారా ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. ఇది కాకుండా, అనేక ఇతర సూక్ష్మక్రిములు కూడా మనం నడిచే నేల పై ఉండవచ్చు. అయితే ఈ సూక్ష్మక్రిమి బ్యాక్టీరియా అందరికీ హాని కలిగించకపోవచ్చు, కానీ కొందరికి మహా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎందుకొచ్చిన గోల..పోతేపోనీ..కిందపడిన దాన్ని మాత్రం తీసుకోకుండా ఉండటమే బెటర్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version