మరో రెండేళ్లలోనే కాంగ్రెస్ దే అధికారం : కోమటిరెడ్డి

-

ధాన్యం కొనుగోలు అంశం నేపథ్యంలో టిఆర్ఎస్ సర్కార్, కేంద్ర ప్రభుత్వం పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. మరో రెండేళ్లలోనే కాంగ్రెస్ దే అధికారం అని ఆయన పేర్కొన్నారు. రైతులు పండగ.. పబ్బం లేకుండా కల్లలాల్ల ఉన్నాడని.. మా సీఎం ప్రధాని అప్పాయింట్ మెంట్ తీసుకున్నాడా..? అని.. నేను ఢిల్లీ ప్రధాని కార్యాలయం అడిగినానని పేర్కొన్నారు. కెసిఆర్ ఢిల్లీ వెళ్లి ఏం చేశారు మరి ? తెలంగాణ లో రైతుల పరిస్థితి చూస్తుంటే ఏడుపోస్తుందని ఆవేదన వ్యాఖ్యమ చేశారు. రైతులంటే చిన్నచూపు సిఎం కెసిఆర్ కి చిన్న చూపని.. ప్రభుత్వాలు ఉన్నది..రైతుల కష్టాలు తీర్చడానికి అని పేర్కొన్నారు.

దేశంలోనే ముందు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ అని.. సోనియా గాంధీ ముందు వద్దన్నా..ఒప్పించి ఇచ్చామన్నారు. రుణమాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ దని.. రైతు ప్రభుత్వం అంటే… కాంగ్రెస్దేనని స్పష్టం చేశారు. కెసిఆర్ నాలుక కోసినా తప్పులేదని.. మూడు ఎకరాల భూమి ఇస్తా అని నేను అనలేదని కెసిఆర్ అంటున్నాడని ఫైర్ అయ్యారు. కెసిఆర్ గురించి మాట్లాడటం వేస్ట్ అని.. దళిత ముఖ్య మంత్రి వద్దని షబ్బీర్ అలీ అన్నాడు అంటున్నాడని.. షబ్బీర్ అలీ కి…నువ్వు సీఎం చేసేందుకు సంబందం ఎంటి..? అని నిలదీశారు. షబ్బీర్ అలీ ఎమ్మెల్యేనే కాలే కదా..? అప్పుడు అని ఫైర్ అయ్యారు. నకిరేకల్ లో రైతులు కల్లలా దగ్గర పాసి పోయిన అన్నం తింటున్నారని.. బాధ అనిపించిందన్నారు కోమటిరెడ్డి. కెసిఆర్ దొంగల మూట లెక్క తయారైందని.. కెసిఆర్ లెక్క ఇంట్లో పడుకోమని.. ఢిల్లీలో కేంద్రాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version