కరోనా వైరస్ బారిన పడ్డ ఎమర్జెన్సీ పేషెంట్ల చికిత్సకు గాను రెమ్‌డెసివిర్ మందును వాడుతున్న సంగతి తెలిసిందే. మార్కెట్‌లో ఈ మెడిసిన్‌ను పలు ఔషధ కంపెనీలు పలు బ్రాండ్ల పేరిట వివిధ ధరలకు అమ్ముతున్నాయి. అయితే దీనికి ఫార్మా కంపెనీ హెటిరో జనరిక్ వెర్షన్‌ను అందుబాటులోకి తెస్తామని ఇది వరకే ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ కంపెనీ ఈ మందును మార్కెట్‌లో విక్రయించడం ప్రారంభించింది.
కూకట్‌పల్లిలో హెటిరో ఫార్మా రెమ్‌డెసివిర్ మందుకు గాను జనరిక్ వెర్షన్‌ను విక్రయిస్తోంది. ఈ మెడిసిన్ ఒక్క ఇంజెక్షన్ ఖరీదు రూ.5,400. కాగా 6 డోసుల్లో రూ.32,400కు దీన్ని కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ మెడిసిన్‌ను కూడా మెడికల్ మాఫియా బ్లాకులో అమ్మవచ్చనే ఉద్దేశంతో ఆ కంపెనీయే స్వయంగా దీన్ని విక్రయిస్తోంది. కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద వశిష్ట ఫార్మా కార్యాలయంలో ఈ మందును అమ్ముతున్నారు.
హెటిరో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు కావాల్సిన వారు డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్‌తోపాటు ఆధార్ కార్డు ఒరిజనల్, జిరాక్స్ కాపీ, కరోనా టెస్టు డాక్యుమెంట్‌ను చూపించాల్సి ఉంటుంది. వారికే ఈ మందును విక్రయిస్తారు. కాగా హెటిరో రెమ్‌డెసివిర్‌ను కోవిఫోర్ పేరిట విక్రయిస్తోంది.