రాబోయే 72 గంట‌లు భారీ వర్షాలు : జిహెచ్‌ఎంసి హై అలెర్ట్

-

గ్రేటర్ హైద్రాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో జీహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. రాబోయే 72 గంట‌ల పాటు అధికారులు, DRF బృందాలు అప్ర‌మ‌త్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైద్రాబాద్ లో కొన్ని చోట్ల 9 నుండి 16 సెంటిమీట‌ర్ల అతి భారీ వ‌ర్షపాతం ప‌డే అవ‌కాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

rain2

దీంతో నగర ప్రజ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలని ఆయన కోరారు. అతి భారీ వ‌ర్షాల వ‌ల‌న ఏర్పడే వ‌ర‌ద‌ ప‌రిస్థితిని ఎదుర్కునేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు. తమ ప‌రిధిలోని క్షేత్ర‌స్థాయి మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ బృందాల‌ను అప్ర‌మత్తంచేసి, అందుబాటులో ఉంచాల‌ని జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, డిప్యూటి క‌మిష‌న‌ర్లని ఆయన ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో రిలీఫ్ సెంట‌ర్లుగా గుర్తించిన పాఠ‌శాల‌లో, క‌మ్యునిటీహాల్స్‌, ఇత‌ర వ‌స‌తుల‌ను సిద్దంగా ఉంచాలని ఆదేశాలు జరీ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version