హైకోర్టు బెంచ్‌ ఎదుట మూడు డిమాండ్లు పెట్టిన హాథ్రస్‌ బాధితురాలి కుటుంబం…!

-

అలాహాబాద్‌ హైకోర్టు బెంచ్‌ ఎదుట మూడు అంశాలను పెట్టారు హాథ్రస్‌ బాధితురాలి కుటుంబ సభ్యుల తరఫు న్యాయవాది. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని, రెండోది కేసును మరో చోటకు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని, కేసు దర్యాప్తు వివరాలను గోప్యంగా ఉంచాలని కోరుతున్నట్టు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం… సంబంధం అంశాలను తెరపైకి తెచ్చి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.


హాథ్రస్‌లో 20ఏళ్ల మహిళపై అగ్రకులాలకు చెందిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి తీవ్రంగా గాయపర్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీవ్ర గాయాలతో ఢిల్లీలో చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే, మృతదేహాన్ని అర్థరాత్రి సమయంలో హాథ్రస్‌కు తీసుకొచ్చి హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేశారు పోలీసులు. ఆ సమయంలో తమను గృహనిర్బంధంలో ఉంచినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీతో పాటు అడిషనల్‌ DGPలకు అలహాబాద్‌ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version