వరుస వాయుగుండాలు రెండు తెలుగు రాష్ట్రాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షాల తీవ్రతకు రెండు తెలుగు రాష్ట్రాలు బాగా ఇబ్బంది పడుతున్నాయి. తాజాగా వర్షాలు భారీగా పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కాసేపటి క్రితం ప్రకటన చేసింది. ఐఎండి వాతావరణ సూచనలు చేసింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం దీని ప్రభావంతో రాగల నాలుగైదు గంటలు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా,గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.