వరద ప్రాంతాల్లో సాధారణ స్థితులు తెచ్చెoదుకు జి హెచ్ ఎం సి యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ పేర్కొన్నారు. సహాయక చర్యలపై జి హెచ్ ఎం సి యంత్రాంగానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ దిశానిర్దేశం చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో తిరిగి సహాయక చర్యలను కమీషనర్, జోనల్ కమీషనర్లు,అదనపు కమీషనర్లు, డిప్యూటీ కమీషనర్లు మానిటరింగ్ చేస్తున్నారు. పంపులు, మోటార్లు ఏర్పాటు చేసి కాలనీలు, సెల్లార్లలో నిలిచిన నీటిని బయటకు పంపింగ్ చేస్తున్నారు ఇంజనీరింగ్, డి ఆర్ ఎఫ్ సిబ్బoది. అలానే రోడ్లపై నిలిచిన నీటిని డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది క్లియర్ చేస్తున్నారు. వరదతో రోడ్లు,నాలాల్లోకి కొట్టుకువచ్చిన చెత్త, చెదారం,భవన నిర్మాణ,శిధిల వ్యర్ధాల తొలగింపుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది డిజాస్టర్ మేనేజ్మెంట్.