విశాఖ ఘటనలో అరెస్టు అయిన 9 మంది జనసేన నేతలకు హైకోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. జనసేన నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. వారికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం విశాఖపట్నం జైల్లో ఉన్న జనసేన నాయకులు విడుదల కానున్నారు. మరోవైపు విశాఖ ఘటనలో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన జనసేన ప్రధాన కార్యదర్శిలు టి శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణ, మరో నేతని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే హైకోర్టు తీర్పుపైహైకోర్టు తీర్పుహైకోర్టు తీర్పుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ” విశాఖపట్నంలో జనసేన నాయకుల పై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బనాయించిన హత్యాయత్నం కేసుకు సంబంధించి తొమ్మిది మందికి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషకరం. మేము ఎప్పుడూ న్యాయవ్యవస్థను సంపూర్ణంగా విశ్వసిస్తాం. ఆ నమ్మకంతోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. గౌరవ హైకోర్టుకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు”. అన్నారు పవన్ కళ్యాణ్.