కొండ‌ప‌ల్లి ఛైర్మ‌న్ ఎన్నిక పై హైకోర్టు కీలక ఆదేశాలు

-

మున్సిపల్‌ కౌంటింగ్‌ రోజు నుంచి కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ పదవి తీవ్ర ఉత్కంఠత నెలకొన్న సంగతి తెలిసిందే. అధికార వైసీపీ పార్టీ, తెలుగు దేశం పార్టీ లు సమానంగా వార్డులు గెలు పొందడంతో… ఈ ఉత్కంఠత నెలకొంది.

highcourt

అయితే… తాజాగా కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికపై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టిడిపి పార్టీ నేతలు దాఖలుచేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.   రేపు కొండ‌ప‌ల్లి ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాల‌ని  ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు ఆదేశాలు  జారీ చేసింది. కౌన్సిల‌ర్లకు ర‌క్షణ క‌ల్పించాల‌ని ఇన్‌ఛార్జ్ సీపీకి ఆదేశాలు జారీ చేసింది ఏపీ హై కోర్టు. ఎన్నిక ప్రక్రియ ముగించి కోర్టుకు నివేదిక ఇవ్వా ల‌ని ఆదేశించింది హై కోర్టు. ఈ కేసు విచారణనను వచ్చే గురువారానికి వాయిదా వేసింది ఆంధ్ర ప్రదేశ్‌ హై కోర్టు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version