స్ఫూర్తి: కష్టపడి చేసేది ఏదీ చీప్ కాదని.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అమ్మాయి టీ కొట్టు పెట్టి ఆదర్శంగా నిలిచింది..!

-

కష్టపడి చేసే దాంట్లో చీప్ గా ఉండదని ఎంత చిన్న పని అయినా సరే నమ్మకంతో కష్టపడితే తృప్తి ఉంటుంది అని ఈమె రుజువు చేశారు. MA ఇంగ్లీష్ పూర్తి చేసి టీచర్ గా పని చేయాలని అనుకున్నారు ఈమె. కానీ కాలం కలిసి రాకపోవడంతో ఈమె టీచర్ అవ్వలేకపోయారు. అలా అని నిరాశ పడలేదు.

ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యోగం రాకపోయే సరికి ఆమె ఒక టీ స్టాల్ పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. హాబీరా స్టేషన్లో ఈమె ఒక టీ కొట్టుని కూడా మొదలుపెట్టారు ఆ టీ కొట్టు కి ”మా ఇంగ్లీష్ చాయ్ వాలి” అని పేరు కూడా పెట్టారు.

అక్కడ టీ తాగిన వాళ్ళు స్టాల్ పేరు చూసి చాలా బాగా ఆకర్షితులయ్యారని.. ఆమె కథను చూస్తే ఎంతో ఆదర్శంగా ఉందని చెప్పారు. ఏదీ కూడా అసాధ్యం కాదు అని ఈమె నిరూపించారు. ఎంతో మంది ఆడవాళ్ళకి ఈమె ఆదర్శంగా నిలిచారు ఎప్పుడూ కూడా మనం వెళ్లి దారి మనకి సహకరించకపోతే కుంగిపోకూడదు. మరో దారి వెతుక్కుంటూ దానిలో విజయం పొందడానికి చూసుకోవాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version