బ్రేకింగ్ : బండి సంజయ్ కు ఊరట.. విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం

-

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు రాష్ట్ర హైకోర్టు లో భారీ ఊరట లభించింది. బండి సంజయ్ కుమార్ ను విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. బండి సంజయ్ కుమార్ రిమాండ్ రిపోర్టులో కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు… విడుదల చేయాలని జైళ్ల శాఖ డీజీ కి ఆదేశాలు జారీ చేసింది.

తమ ఆదేశాలను తుచా తప్పకుండా అమలు పరచాలని… స్పష్టం చేసింది తెలంగాణ హై కోర్టు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఇవాళ సాయంత్రం బండి సంజయ్ కుమార్ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ హై కోర్టు ఆదేశాలతో బిజెపి నాయకులు నూతన ఉత్సాహం నెలకొంది. బండి సంజయ్ విడుదల నేపథ్యంలో భారీ ర్యాలీ తీసేందుకు కూడా బిజెపి నేతలు సన్నద్ధమవుతున్నారు.

కాగా నాలుగు రోజుల క్రితం బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ జిల్లాలో అరెస్టు అయ్యారు. జాగరన దీక్ష చేపట్టేందుకు ప్రయత్నించిన బండి సంజయ్ కుమార్ ను పోలీసులు కరోనా రూల్స్ కారణంగా అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version