ఐదో టెస్టులో.. ఆసీస్ కుప్పకూలింది. ఈ సిడ్నీ టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 181 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు 4 పరుగుల లీడ్ వచ్చింది. వెబ్‌స్టర్ 57, స్మిత్ 33, సామ్ కొన్‌స్టాస్ 23, అలెక్స్ కేరీ 21 పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తలో మూడు వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డి, బుమ్రా తలో రెండు పడగొట్టారు.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 185 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇక అటు టీమిండియాకు షాక్ తగిలింది. టీమిండియా కెప్టెన్ బుమ్రాకు బిగ్ షాక్ తగిలింది. దీంతో వెంటనే బుమ్రాను ఆస్పత్రికి తరలించారు. అయితే.. బుమ్రాను ఆస్పత్రికి తరలించిన వీడియో వైరల్ గా మారింది. కొంత మంత్రి డాక్టర్ల సాయంతో… ప్రత్యేక కారులో ఆస్పత్రికి వెళ్లాడు బుమ్రా. అతని కాలుకు గాయం అయినట్లు సమాచారం అందుతోంది. ఇక ఆస్పత్రిలో స్కానింగ్ చేసిన తర్వాత.. బుమ్రా హెల్త్ రిపోర్టు రానుంది. ఈ తరుణంలో టీమిండియాకు షాక్ తగిలింది.