ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ కొత్తది ఇవ్వాలని నేడు హై కోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించలేదని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టంగా పేర్కొంది.
పరిషత్ ఎన్నికల విషయంలో రాష్ట్రంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. విపక్షాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. పరిషత్ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. విపక్షాలు కూడా ఎన్నికల విషయంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సరే ఎన్నికల్లో పోటీ చేసాయి. ఎన్నికలు నిర్వహించగా… కౌంటింగ్ విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో దీనిపై హైకోర్టు కీలక ఆదేశాలు వెల్లడించింది.