చైనా నుండి ఎక్స్పోర్ట్ చేసిన కిమ్చీ లో ప్లేగుకి కారణమయ్యే బ్యాక్టీరియా ఉంది..!

-

చైనా నుండి ఎక్స్పోర్ట్ ఆయన కిమ్చీ లో ప్లేగుకి సంబంధించిన బ్యాక్టీరియా ఉందని సౌత్ కొరియన్ ఫుడ్ రెగ్యులేటర్ వెల్లడించింది. 15 కిమ్చీ ప్రొడక్ట్స్ లో Yersinia enterocolitica అనే పదార్థం ఉంది దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తాయని చెప్పింది. ద సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ CDC యూఎస్ లో ప్రతి సంవత్సరం ఈ బాక్టీరియా 35 మందిని బలి తీసుకుంటుంది అని అంది.

దీని వల్ల ప్లేగు వస్తుందని. ప్లేగుకు సంబంధించిన బాక్టీరియా అందులో ఉంటుంది అని చెప్పింది. అయితే దీని కారణంగా జ్వరం, కడుపు నొప్పి, ఎపండసిటీస్ మరియు బ్లడ్ డయేరియా వంటి సమస్యలు వస్తాయని.. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా దీని బారిన పడిపోతారని చెప్పారు.

చైనా కంపెనీలు తయారు చేసే వాటిని కొరియన్ మినిస్టరీ ఇన్స్పెక్షన్ చేస్తామని చెప్పింది. ఆ ప్రోడక్ట్స్ ని తిరిగి చైనాకు పంపిస్తామని లేదంటే వాటిని డిస్కార్డ్ చేస్తామని చెప్పింది. అదే విధంగా చైనీస్ సాల్ట్ క్యాబేజ్ ప్రొడక్ట్స్ ని తీసుకు వస్తే 4 వాటిలో 2 డిహైడ్రో ఎసిటేట్ అనే ప్రిజర్వేటివ్ ని ఉపయోగించి ఉందని చెప్పింది.

అయితే కొరియాలో ఆ పదార్థం నిషిద్ధం. ఈ విషయాల మీద చైనా మరియు కొరియన్ వాళ్ళు సోషల్ మీడియా లో అనేక చర్చలు చేస్తున్నారు అని తెలుస్తోంది. ఎప్పటి నుంచో అందరూ ఈ కిమ్చీని తింటూ ఉంటారు. ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో చైనా నుండి కొరియా వాళ్ళు 68 వేల టన్నులకు కిమ్చీ ని ఆర్డర్ చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version