గత కొన్ని రోజులుగా అచ్చన్నాయుడు బెయిల్ పిటిషన్ పై ఏపీ హై కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈఎస్ఐ స్కాం లో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ మంజూరు చేయాలంటూ అచ్చన్నాయుడు కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. తాజాగా టిడిపి శాసన సభ ఉప నేత అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. అయితే ప్రభుత్వం తరుపు వాదనలు అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు.. అచ్చన్నాయుడు బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వులో పెట్టింది.
అచ్చన్నాయుడు బెయిల్ పిటిషన్పై తీర్పును ఈ నెల 29న వెలువరించే అవకాశం ఉన్నది అని ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇక అచ్చన్నాయుడు వ్యవహారంపై ఆంధ్ర రాజకీయాల్లో కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చన్నాయుడు.. ఈఎస్ ఐ స్కామ్ కు పాల్పడ్డారు అంటూ జగన్ సర్కార్ ఆరోపణలు చేసింది.