బ్రేకింగ్ : బాబుకి ఇచ్చిన సీఐడీ నోటీసుల మీద హైకోర్టు స్టే

-

అమరావతి అసైన్డ్ భూములకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి సీఐడీ ఇచ్చిన నోటీసుల మీద ఏపీ హైకోర్టు స్టే విధించింది. సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసుల మీద చంద్రబాబు, నారాయణ విడివిడిగా క్వాష్ పిటిషన్ లు డాఖలు చేశారు. దీంతో ఈ అంశంలో స్పష్టమైన ఆధారాలు ఉంటే దాఖలు చేయాలని కోర్టు సీఐడీ అధికారులను ఆదేశించారు.

అయితే పూర్తి స్థాయి విచారణ చెస్తే అవి బయటకు వస్తాయని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేసిన సీఐడీ చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. 23వ తేదీన తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ చంద్రబాబు కు ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతే కాక ఎస్సీ, ఎస్టీ సహా మొత్తం పది కేసులు నమోదు చేశారు. ఈ అంశం మీద కోర్టుకు వెళ్లిన చంద్రబాబుకు ఊరట లభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version