పెద్దిరెడ్డికి చుక్కెదురు..అటవీ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు !

-

పెద్దిరెడ్డికి చుక్కెదురు అయింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల అధీనంలో ఉన్న అటవీ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పెద్దిరెడ్డి అటవీ భూములపై చట్ట నిబంధనలు పాటించాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భూముల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తే చట్ట నిబంధనలు అనుసరించాలని రెవెన్యూ, అటవీశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

peddireddy

పూర్తి వివరాలతో 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, అటవీ శాఖ ప్రధాన సంరక్షణ అధికారి, చిత్తూరు జిల్లా కలె క్టర్, పులిచర్ల తహసీల్దార్కు నోటీసులు జారీ అయ్యాయి. తదుపరి విచారణను మార్చి 6కి వాయిదా పడింది. చిత్తూరుజిల్లా, పులి చర్ల మండలం, మంగళంపేట గ్రామ పరిధిలోని వివి ధ సర్వేనెంబర్లలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల ఆధీనంలో సుమారు 75.74 ఎకరాల భూమి ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా అధి కారులను నిలువరించాలని కోరుతూ పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, ద్వారకానాథ్డ్డి, రాజంపేట ఎంపీ మిథు న్రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ల పై విచారణ జరిపిన హైకోర్టు… అటవీ భూములపై ఆదేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version