తెలంగాణ రాష్ట్ర DSC 2008 అభ్యర్థులకు అలర్ట్.. కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. 2008 డీఎస్సీ బాధితులకు కాంట్రాక్టు ప్రాతిపదికన టీచర్ ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. 1382 మందికి 2024 – 25 విద్యా సంవత్సరానికి నియమించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం అను మతి ఇచ్చింది.
ఇక తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్ణయంతో… తెలంగాణ రాష్ట్ర DSC 2008 అభ్యర్థులు ఇకపై.. ఎస్జీటీలుగా కొనసాగనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర DSC 2008 అభ్యర్థులను ఎస్జీటీలుగా నియమించనుంది పాఠశాల విద్యా శాఖ. దీంతో… వారికి నెల వేతనం 31 వేల 41 రూపాయలు ఉండనుంది. ఈ రోజే అంటే ఫిబ్రవరి 15వ తేదీన వారికి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ లకి, జిల్లా విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర సర్కార్.