చంద్రబాబు ఇంటి పక్కనున్న ప్రజా వేదికను కూల్చి ఇవాళ్టికి మూడేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రజా వేదిక కూల్చి మూడేళ్లైన సందర్భంగా శిథిలాల వద్ద నిరసన టీడీపీ నేతలు తెలియచేయనున్నారు. టీడీపీ నేతల నిరసన ప్రణాళికతో పోలీసులు అలర్టయ్యారు. దీంతో చంద్రబాబు ఇంటి సమీపంలో పోలీసుల మొహరించారు. కరకట్ట మీదకు వాహానాల రాకపోకలను నిలిపేసిన పోలీసులు.. బారికేడ్లు.. ముళ్ల కంచెలు సిద్దం చేశారు.
సీఎం నివాసం వద్ద నిరసన తెలిపేందుకు టీడీపీ నేతలు సిద్దమవుతున్నారు. అయితే ఇదిలా ఉంటే.. ఉదయం టీడీపీ చీఫ్ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌పై విమర్శలు గుప్పిస్తూ పోస్టులు పెట్టారు. అంతేకాకుండా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. అంతేకాకుండా సీఎం జగన్‌ను లోకేష్ లేఖ రాశారు. అన్న క్యాంటీన్లతో పాటు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిలిపివేసిన అన్ని సంక్షేమ పథకాలను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు.