ఫ్యాక్ట్ చెక్: వాచ్ తో డబ్బులు కాజేసిన కుర్రాడు..వీడియో లో ఏముందంటే?

-

టోల్‌ ప్లాజాల వద్ద వెహికల్స్ టాక్స్ కోసం కేంద్రం ఫాస్టాగ్‌ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానంతో హైవేలపై ప్రయాణం మరింత తేలికగా మారింది..ఫాస్టాగ్‌ బార్‌ కోడ్‌ సహాయంతో టోల్‌ చెల్లింపులు సులభతరంగా మారాయి. దీంతో క్యూలో వేచి ఉండే పని కూడా తప్పింది. ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఫాస్టాగ్‌ భద్రతపై ఇటీవల కొన్ని వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఫాస్టాగ్‌ సెఫ్టీని ప్రశ్నార్థకంగా మార్చే ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది..ఈ విషయం కాస్త ఫాస్టాగ్‌ వరకూ వెళ్ళింది.దీనిపై ఫాస్టాగ్‌ అధికారికంగా స్పందించాల్సి వచ్చింది.ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే రోడ్డుపై కార్లు ఆగిన సమయంలో కార్ల అద్దాలను తూడుస్తూ కొందరు డబ్బులు అడుక్కుంటారనే విషయం తెలిసిందే.

ఓ కుర్రాడు చేతుకి స్మార్ట్‌ వాచ్‌ ధరించి కారు ఫ్రంట్‌ అద్దాన్ని క్లీన్ చేస్తున్నాడు..అద్దంపై ఉన్న ఫాస్టాగ్‌ బార్‌కోడ్‌పై రుద్దుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో సదరు స్మార్ట్‌ వాచ్‌ సహాయంతో ఫాస్టాగ్‌లోని డబ్బులను కాజేస్తున్నాడు అంటూ నెట్టింట ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఫాస్టాగ్‌లో ఉన్న డబ్బునంతా స్మార్ట్‌ ఫోన్‌తో స్కాన్‌ చేసి కాజేస్తున్నట్లు వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..

తాజాగా ఈ విషయం పై ఫాస్టాగ్‌ అధికారికంగా స్పందించింది. నెట్టింట జరుగుతోన్న ప్రచారంపై క్లారిటీ ఇస్తూ ఓ ట్వీట్ చేసింది. ‘ఫాస్టాగ్‌ లావాదేవీలు పూర్తిగా రిజిస్టర్డ్‌ మర్చెంట్స్‌ (టోల్‌, పార్కింగ్ ప్లాజా)కోసం మాత్రమే కేటాయించినవి. అనధికారిక డివైజ్‌లు ఏవీ ఫాస్టాగ్‌ బార్‌ కోడ్‌ ను స్కాన్ చేయలేవు..ఇలాంటి వాటిని నమ్మకండి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version