జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ముందు భారీగా పోలీసులు మోహరించారు. జీహెచ్ఎంసి కార్యాలయం ముందు రేవంత్ రెడ్డి ధర్నాకు దిగారు. మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డి వస్తున్నారన్న నేపధ్యంలో ఈ ఉదయం నుండే పోలీసులు భారీగా మోహరించారు.
వరద కారణంగా ఇబ్బంది పడిన ప్రజలకు సహాయం అందించాలని జీహెచ్ఎంసి కమీషనర్ ను కలవడానికి రేవంత్ అపాయింట్ మెంట్ తీసుకున్నారు. ఇప్పటికే ఎల్.బి.నగర్,సికింద్రాబాద్, కూకట్పల్లి జోనల్ కమీషనర్ లను కలసిని రేవంత్ జీహెచ్ఎంసి కమీషనర్ కలవడానికి వచ్చి మెరుపు ధర్నాకు దిగారు. వరద బాధితులకు న్యాయం చేయాలంటూ జీహెచ్ఎంసి కార్యాలయం ముందు రేవంత్ ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసి కార్యాలయం ముందు రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించారు.