దీపావళి సందర్భంగా ఫైర్ క్రాకర్ల అమ్మకం అలాగే, వినియోగం పై నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ కాసేపట్లో కీలక తీర్పు చెప్పనుంది. 23 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో వాయు కాలుష్యం, కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుండడం వల్ల ఎన్జీటీ తీర్పు ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ అంశంపై అభిప్రాయం చెప్పాల్సిందిగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖతో పాటు ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని ఎన్జీటీ ఆదేశించింది.
నవంబర్ ఏడు నుంచి 30 వరకూ ఫైర్ క్రాకర్ల వినియోగంపై నిషేధం విధించడంపై ఢిల్లీ పోలీసు కమిషనర్‌తో పాటు ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీలను అభిప్రాయం చెప్పాల్సిందిగా ఇప్పటికే ఎన్జీటీ కోరింది. ఢిల్లీలో రోజురోజుకి కాలుష్యం పెరిగిపోతూ ఉండడంతో దానిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.