Big News : పోలవరం ప్రాజెక్టు వద్ద పోలీసులతో చంద్రబాబు వాగ్వాదం.. ఉద్రిక్త పరిస్థితులు

-

ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత నారా
చంద్రబాబునాయుడు సాయంత్రం వేళ… పోలవరం ప్రాజెక్టు సందర్శన కోసం పోలవరం గ్రామం వద్దకు చేరుకున్నారు. అయితే ఈ
క్రమంలో.. పోలవరం ప్రాజెక్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు ఏ ఒక్కరికి అనుమతి లేదంటూ పోలీసులు అప్పటికే పోలవరం ప్రాజెక్టు ముఖద్వారం వద్ద భారీ వాహనాలతో ఓ బారికేడ్ ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే చంద్రబాబు అక్కడకు చేరుకోవడం, పోలవరం సందర్శనకు ఎవరినీ అనుమతించేది లేదని పోలీసులు చెప్పడంతో పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఓ సందర్భంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

తాను చేపట్టిన పోలవరం ప్రాజెక్టు సందర్శనకు తనకే అనుమతి ఇవ్వరా? అని పోలీసులతో చంద్రబాబు వాగ్వాదానికి దిగారు. అయితే నక్సలైట్లకు చెందిన వారోత్సవాలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో చంద్రబాబుకు నక్సలైట్ల నుంచి ముప్పు పొంచి ఉందని చెప్పిన పోలీసులు.. ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబుకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు తెలిపారు. అయితే చంద్రబాబుతో పాటు మరో ఐదుగురు నేతలకు అనుమతి ఇవ్వాలని టీడీపీ నేతలు పోలీసులను కోరారు. అందుకు కూడా పోలీసులు తిరస్కరించడంతో చంద్రబాబు పోలవరం ముఖద్వారం వద్దే రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులు ఆయన వెనుకే బైఠాయించాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version