మునుగోడును గెలిపిస్తే నియోజకవర్గాన్ని గుండెళ్లో పెట్టుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు.. గతంలో ఎన్నడూ లేనంతగా నల్లగొండలో 12 స్థానాలను గెలిచిన చరిత్ర ఏ పార్టీకి లేదు.. మీరు ఇంతలా ఆశీర్వదించారు కాబట్టే కేసీఆర్ ఆదేశానుసారం ఇక్కడకి వచ్చామన్నారు మంత్రి కేటీఆర్. గురువారం నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో కేటీఆర్, ఇతర మంత్రుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మీరు గెలిపించింది కూసుకుంట్ల ను కాదు మా అందరినీ. రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామన్నారు. అంతేకాకుండా.. గతంలో ఉమ్మడి జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేదు. కేసీఆర్ వచ్చాక నల్లగొండ, సూర్యాపేట లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి క్లాసులు కూడా ప్రారంభించాం. దామరచర్ల లో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కారణంగా రాబోయే వందేళ్ల వరకు విద్యుత్ అవసరాలు తీర్చే ప్రాజెక్టు నిర్మిస్తున్నాం.
అక్కడే సోలర్ పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తాం. తెలంగాణలో అత్యథికంగా వరి పండించేది నల్లగొండ జిల్లా. జిల్లాలో సాగు విస్తీర్ణం కేవలం కేసీఆర్ ప్రోత్సాహం కారణంగానే పెరిగింది. తిరుమల స్థాయిలో యాదాద్రి కి భక్తులు తరలివస్తున్నారు. దండు మల్కాపురంలో 540 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ స్థాపించి పారిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు టీఆర్ఎస్ ను ఏవిధంగా గుండెళ్లో పెట్టుకుని 12నియోజకవర్గాల్లో గెలిపించారో మిమ్మల్ని అలానే గుండెళ్లో పెట్టుకుంటాం. రాబోయే ఏడాది కాలంలో ఉమ్మడి జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో ఇవాళ సమీక్ష చేశాం. రూ. 402 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతాం. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతుల కల్పన కోసం 700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. మున్సిపాలిటీ ల్లో 334 కోట్లు ఖర్చు చేస్తాం. గిరిజనుల అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. మొత్తం ఆరు, ఏడు నెలల్లో ఈనాలుగు డిపార్ట్మెంట్ ల పరిధిలో రూ. 1544 కోట్లు కేటాయించి ఖర్చు చేయబోతున్నాం.
మునుగోడులో వంద కోట్లతో రహదారుల విస్తరణ చేస్తాం. పంచాయితీ రాజ్ శాఖ ద్వారా రూ. 174 కోట్లు కేటాయిస్తున్నాం. చండూరు మున్సిపాలిటీ కి రూ. 30 కోట్లు ,చౌటుప్పల్ మున్సిపాలిటీ లో రూ. 50 కోట్లు కేటాయిస్తున్నాం. గిరిజనుల కోసం అభివృద్ధి నిధులు కేటాయిస్తాం. ఐదు సబ్ స్టేషన్ల నిర్మాణం ఎనిమిది కోట్లు కేటాయిస్తాం. నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తాం. దండు మల్కాపురం లో వంద ఎకరాల్లో టాయ్ పార్క్ ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా పది వేల మందికి ఉపాధి వస్తుంది. చండూరుని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తాం. నారాయణ పురంలో గిరిజన గురుకుల పాఠశాల, కోటి రూపాయలతో సేవాలాల్ బంజారా భవన్ ఏర్పాటు చేస్తాం. నాలుగు హ్యాండ్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం. జిల్లా, మునుగోడు అభివృద్ధి కోసం చెప్పిన విధంగానే ముందుకు పోతాం.’ అని ఆయన వెల్లడించారు.