చలో రామతీర్ధ కార్యక్రమానికి భాజపా-జనసేన పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ముందస్తుగా బిజేపి భాజపా నాయకులు ఇళ్ల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలిసులు. ‘చలో రామతీర్ధం ‘ కార్యక్రమంలో పాల్గొనడానికి. విశాఖ బిజెపి కార్యాలయానికి చేరుకున్న ఎం.పీ సిఎం రమేష్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావులను అక్కడే హౌస్ అరెస్ట్ చేసినట్టు సమాచారం. బీజేపీ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు, బీజేపీ ఆఫీస్ బయట, లోపల పహారా కాశారు.
రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజుకి 151 నోటీస్ ఇచ్చిన పోలీసులు ఆయనను విశాఖలోనే ఉంచేశారు. మరో పక్క నెల్లిమర్ల – రామతీర్దం జంక్షన్ లో బారికేడ్లు పెట్టి వచ్చే వారిని అడ్డుకుంటున్నారు పోలీసులు. అయితే విశాఖ నుండి వివిధ మార్గాల్లో చేరుకుంటున్న అందరినీ నెల్లిమర్ల వద్ద అడ్డుకుంటున్నారు. ఇక నెల్లిమర్ల వద్ద స్థానిక పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ, ఏపీఎస్పీ బలగాలతో పహారా కాస్తున్నారు.