సమగ్ర సర్వే KCR వాళ్ళ కుటుంబం కోసం చేసుకున్నారు.. లిమ్కా బుక్ కోసం చేశారు అని మంత్రి సీతక్క అన్నారు. కానీ కుల గణన అనేది రాహుల్ గాంధీ డ్రీమ్. మేము రోజుకు పది కుటుంబాలే సర్వే చేశాం. కానీ కేసీఆర్.. ఒకే రోజు సర్వే చేశారు. ఇక బీసీలకు వచ్చే అవకాశాలు పక్కదారి పట్టించే పనిలో ఉన్నారు. BRS వాళ్ళు ఇచ్చింది 51 శాతం.. మేము ఇచ్చింది 56 శాతం BCలకు ఇచ్చాం.
అయితే తీన్మార్ మల్లన్న మా పార్టీ నా… ఏ పార్టీ అనేది చూడాలి. నేను ఆయన కోసం కూడా కష్టపడ్డ. కానీ ఈ సర్వేలో పాల్గొనని వాళ్ళు అడిగే హక్కు ఉందా.. తోడేళ్లు వచ్చి.. గొర్రె లను కాపాడతా అంటే నమ్ముతమా.. ఈ తోడేళ్ళును మేము నమ్మం. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడానికి మీ పార్టీలో బీసీ నాయకుడే లేడా.. నీ కులం పేరు కూడా నువ్వు చెప్పుకోలేక పోయావు. మీరు మేక వన్నె పులి. మిమ్మల్ని నమ్మరు ప్రజలు. బీసీల సంతోషం చూసి భరించలేక పోతున్నారు. అందుకే అపోహలు సృష్టిస్తున్నారు అని సీతక్క పేర్కొన్నారు.