ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు పది గంటల సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని సమయం కావాలని కోరుతోంది. ఇప్పటికే హైకోర్ట్ తీర్పు మీద ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా సోమవారం నాడు విచారణ చేస్తామని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
దీంతో ఎల్లుండి దీనికి సంబంధించిన విచారణ జరగనుంది. ఇక దీనికి సంబంధించి అధికారులు న్యాయ నిపుణులతో సీఎం జగన్ చర్చలు జరిపారు. ఇవేవీ పట్టని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు ఉదయం 10 గంటలకు తొలిదశ ఎన్నికల పంచాయతీ ఎన్నికల ప్రకటన చేయనుంది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 25 నుంచి అంటే ఎల్లుండి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.