పల్నాడులో మరోసారి హైటెన్షన్.. భారీగా మారణాయుధాలు లభ్యం

-

ఏపీలోని పల్నాడు జిల్లాలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్ల రూరల్ శిరిగిరిపాడులో ఆదివారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించగా.. కొందరి ఇళ్లలో భారీగా మారణాయుధాలు లభ్యం అయ్యాయి. శిరిగిరిపాడులో వారం క్రితం వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య గొడవలు జరిగాయి. రెండు వర్గాల మధ్య దాడులు జరిగే చాన్స్ ఉందని సమాచారం రావడంతో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించి.. భారీగా మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

పరస్పరం దాడుల కోసం ఇరు పార్టీల కార్యకర్తలు 11 వేట కొడవళ్ళు, రెండు కత్తులు, ఐదు గొడ్డళ్లు, 21 బరిసెలు, 20 ఇనుపరాడ్లు, 16 కర్రలు, 13 బస్తాలలో రాళ్ళు, కారం కలిపిన నీళ్లు ఉన్న 8 సీసాలను గొనె సంచుల్లో దాచినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు.కార్డెన్ సెర్చ్‌లో ఇన్చార్జి డీఎస్పీ ఎం.హనుమంత రావు, మాచర్ల రూరల్ సీఐ నఫీజ్ భాషా, వెల్దుర్తి ఎస్ఐ సమందర్ అలీ గురజాల ఇతర అధికారులు పాల్గొనగా.. 17 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news