అన్వేష్‌పై బయ్యా సన్నీ యాదవ్ షాకింగ్ కామెంట్స్.. రూ. 4 కోట్లు అంటూ

-

అన్వేష్‌పై బయ్యా సన్నీ యాదవ్ ఘాటు విమర్శలు చేసాడు. జనాలను మభ్యపెట్టి అన్వేష్ క్యాష్ చేసుకుంటాడని సన్నీ వ్యాఖ్యలు చేశారు. అన్వేష్‌ను దరిద్రుడిగా అభివర్ణించాడు సన్నీ యాదవ్. అన్వేష్ రూ.4 కోట్లు సంపాదించాడని సన్నీ యాదవ్ కామెంట్ చేశారు. జనాలు అన్వేష్ ట్రాప్‌లో ఎలా పడ్డారో అర్థం కావడం లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.

Sunny Yadav’s shocking comments on Anvesh

 

కాగా, ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌ కు ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు నమోదు అయ్యింది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్ రాజు తదితరులపై ఆరోపణలు చేశారు ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారం పేరుతో రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా ప్రచారం చేశాడని సుమోటాగా కేసు నమోదు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news