పశువుల పేడతో అధిక పంట దిగుబడులు..! 

-

పంటపొలాల్లో రసాయన ఎరువులు వాడటం నేడు విపరీతంగా పెరుగుతుంది. వ్యవసాయంలో సగం పెట్టుబడి ఇక్కడే పోతుంది. దీనివల్ల ఖర్చు ఎక్కువే.. భూమికి జరిగే నష్టాలు ఎక్కువే.. వీటి ద్వారా పండిన వాటిని తినటం వల్ల మనుషులకు ఏర్పడే దుష్ప్రభావాలు కూడా ఎక్కువే. ఈమధ్య సేంద్రీయ వ్యవసాయానికి డిమాండ్ బాగా పెరిగింది. ఎలాంటి పురుగుమందులు లేకుండా ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా పండించే ఉత్పత్తులు విక్రయించేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి.. సేంద్రీయ విధానంలో పశువుల పేడను పంటపొలాలకు ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. ఆరోగ్యానికి కూడా సేంద్రీయ ఉత్పత్తులు మేలు చేస్తాయి.
రసాయన ఎరువులు అధిక మొత్తంలో వాడటం వల్ల పంటపొలాల్లో భూసారం క్షీణిస్తుంది. అంతేకాకుండా పంటల దిగుబడి కూడా తగ్గుతుంది. పశువుల ఎరువులు వాడటం వల్ల భూమి గుల్లబారి భూసారం పెరుగుతుంది. రైతులు దుక్కి దున్నాక ముందుగా సేంద్రీయ ఎరువులైన పశువుల పేడను పంట పొలాల్లో వెదజల్లు కోవాలి. భూమిలో సేంద్రీయ ఎరువు పూర్తిగా కలిసి పోయే వరకు దుక్కులు దున్ని భూమిని చదును చేసుకోవాలి. పశువుల ఎరువు, వర్మీకంపోస్ట్ ఎరువు, గొర్రెలు, మేకలు, కోళ్ల ఎరువును సేంద్రియ ఎరువులుగా వాడుకోవచ్చు. సేంద్రీయ ఎరువులను వేయటం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. దిగుబడి పెరుగుతుంది.
రసాయన ఎరువుల వల్ల కృత్రిమ పోషక పదార్ధాలు ఉంటాయి. అయితే సేంద్రీయ ఎరువుల్లో సహజసిద్ధమైన లవణాలు, పోషక పదార్ధాలు పంటలకు అందుతాయి. ఎకరానికి 5 ట్రాక్టర్ల పశువుల ఎరువును వాడటం వల్ల పైరు ఆరోగ్యంగా పెరుగుతుంది. చీడపీడలను తట్టుకునే శక్తి మొక్కలకు అధికమవుతుంది. సేంద్రీయ ఎరువులతో పండించి పంటలు ఆహారంగా తీసుకోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
వేలకు వేలు రసాయనాల మీద ఖర్చుచేసేకంటే.. పంట వేసేముందే.. పశువుల ఎరువును విక్రయించి పొలాల్లో చల్లితే.. చీడపీడలు ప్రభావం తక్కువగా ఉంటుంది. రైతులు కౌలు భూములను పశువుల ఎరువు ఉపయోగించరు.. భూమి మీది కాకున్నా.. పండించేది మీరే కదా.. ఎలాగూ.. పురుగుమందులకోసం ఫెస్టిసైడ్స్, మందులు చల్లుతారు.. ఆ ఖర్చు ఏదో పశువుల పేడ మీద పెడితే..మంచి దిగుబడి ఉంటుంది అంటున్నారు సేంద్రీయ వ్యవసాయ నిపుణులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version