కర్ణాటక హిజాబ్ వివాదం: నేడు హైకోర్ట్ లో విచారణ… తీర్పుపై సర్వత్రా ఆసక్తి

-

కర్ణాటకలో ‘ హిజాబ్’ వివాదం రాజుకుంటుంది. చిన్న విషయంగా మొదలైన ఈ వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓవర్గం విద్యార్థులు హిజాబ్ ధరించి రావడం… మరో వర్గం విద్యార్థులు దీన్ని వ్యతిరేఖిస్తూ… కాషాయ కండువాలతో తరగతులకు హాజరుకావడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కేవలం ఉడిపి జిల్లాలో ప్రారంభమైన ఈ అంశం నెమ్మదిగా రాష్ట్రంలోని బెళగావి, కొప్పెల, మండ్యా, బాగల్ కోట్ జిల్లాలకు కూడా విస్తరించాయి. దీంతో ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా హ్యాండిల్ చేస్తోంది. నిన్ని రాష్ట్రంలోని పలు చోట్ల అల్లర్లు చెలరేగాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం నేటి నుంచి మూడు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది.

మరోవైపు ఈ హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్ట్ నేడు కూడా విచారణ చేయనుంది. నిన్న విచారించిన కోర్ట్..ఈ అంశంపై ఎలాంటి భావోద్వేగాలు లేకుండా నిర్ణయం తీసుకుంటామని… రాజ్యాంగమే మాకు భగవద్గీత అంటూ వ్యాఖ్యానించింది. దీంతో ఈరోజు కర్ణాటక హైకోర్ట్ ఏం తీర్పు ఇస్తుందో అని.. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కోర్ట్ నిన్న విద్యార్థులు సంయమనం పాటించాలని, శాంతియుతంగా ఉండాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version