నిన్న పార్లమెంట్ సాక్షిగా.. దేశ ప్రధాని అయి ఉండి.. నరేంద్ర మోడీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఓ నియంతలా మాట్లాడారు. తలుపులేసి… అన్యాయంగా తెలుగు రాష్ట్రాలను విడగొట్టారని కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. అయితే.. ప్రధాని మోడీ చేసిన ఆ వ్యాఖ్యలు.. ఇప్పుడు తెలంగాణలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేయనుంది.
ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేఖంగా.. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేయనున్నారు. మండల కేంద్రాలు, నియోజకవర్గాల్లో బీజేపీ దిష్టి బొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు. నల్లజెండాలతో ఆందోళనలు చేయాలని శ్రేణులకు సూచించారు. అటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా.. తెలంగాణ వ్యాప్తంగా ప్రధాని మోడీ దిష్టి బొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు.