hijab row: హిజాబ్ పై నేడు కోర్ట్ తీర్పు.. కర్ణాటక వ్యాప్తంగా పలు జిల్లాల్లో 144 సెక్షన్

-

కర్ణాటకలో పాటు దేశవ్యాప్తంగా సంచలన కలిగించిన హిజాబ్ వివాదంపై నేడు కర్ణాటక హైకోర్ట్ తీర్పు వెల్లడించనుంది. గత కొన్ని నెలులగా కర్ణాటకలో సాగుతున్న ఈ వివాదంపై కోర్ట్ ఏం తీర్పు చెబుతుందా.. అని అందరిలో ఉత్కంఠత నెలకొంది. ఇదిలా ఉంటే కర్ణాటక వ్యాప్తంగా ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా హిజాజ్ వివాదం చెలరేగిన పలు జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. మరోవైపు కర్ణాటక హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్థి నివాసం వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. కలబురిగి, ఉడిపి, శివమొగ్గ మొదలైన జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. విద్యా సంస్థలను మూసేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

కర్ణాటకలో చిన్నగా ప్రారంభమైన ఈ వివాదం… దేశ రాజకీయాలను కూడా కుదిపేసింది. పొలిటికల్ గా కూడా హిజాబ్ వివాదం చాలా చర్చనీయాంశం అయింది. కర్ణాటకలోని ఓ పాఠశాలతో విద్యార్థినిలు హిబాబ్ ధరించి రావడం.. మరో వర్గం విద్యార్థులు దీన్ని వ్యతిరేఖిస్తూ… కాషాయ కండువాలతో విద్యాలయాలకు రావడంతో వివాదం మరింత పెరిగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఉడిపి, శివమొగ్గ, కులబురిగి, చిక్ మంగుళూర్, కొప్పెల జిల్లాల్లో ఈ వివాదం వ్యాపించింది. కర్ణాటక మొత్తంగా హిజాబ్ వివాదంలో అట్టుడికిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version