IPL 2022 : ఐపీఎల్ జ‌ట్ల‌కు గుడ్ న్యూస్.. డీఆర్ఎస్ ప‌రిమితి రెండుకు పెంపు

-

ఐపీఎల్ జ‌ట్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ లో ఉన్న డీఆర్ఎస్ నిబంధ‌న విషయంలో ప‌లు మార్పులు చేసింది. గ‌తంలో ఒక్క ఇన్నింగ్స్ లో ఒక జ‌ట్టుకు కేవ‌లం ఒక్క డీఆర్ఎస్ అవ‌కాశం ఉండేది. అది విఫ‌లం అయిన త‌ర్వాత‌.. ఆ జ‌ట్టు తిరిగి రివ్యూ తీసుకోవ‌డానికి అవ‌కాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు బీసీసీఐ తీసుకువ‌చ్చిన నూత‌న మార్పుల ద్వారా ఇక్క ఇన్నింగ్స్ లో ఒక జ‌ట్టుకు రెండు డీఆర్ఎస్ అవ‌కాశాలు ఉండ‌నున్నాయి.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ఐపీఎల్ మిన‌హా అన్ని ఫార్మెట్ ల‌లో రెండు డీఆర్ఎస్ అవ‌కాశాలు ఉండేవి. కానీ తాజా గా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఐపీఎల్ ల్లో కూడా రెండు డీఆర్ఎస్ అవ‌కాశాలు వ‌చ్చాయి. అలాగే ప్లే ఆఫ్స్ లేదా.. ఫైన‌ల్ లో మ్యాచ్ టై అయితే.. సూప‌ర్ ఓవ‌ర్ ఉంటుంది. అయితే ఒక వేళా… సూప‌ర్ ఓవ‌ర్ నిర్వ‌హించ‌డం సాధ్యం కాని స‌మ‌యాల్లో లీగ్ స్టేజ్ లో టాప్ లో ఉన్న జ‌ట్టును విజేతగా ప్ర‌క‌టించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version