సుప్రీంకు చేరిన ‘ హిజాబ్’ కేసు.. కర్ణాటక హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్

-

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన అంశం ‘ హిజాబ్’. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్ట్ కు చేరింది. మంగళవారం కర్ణాటక హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు అయింది. ముస్లిం మహిళ విద్యార్థినిల తరుపున నిబా నాజ్ అనే ముస్లిం విద్యార్థి తరపున సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. హిజాబ్ ధరించే హక్కు ఆర్టికల్ 19(1) (ఎ)  భావప్రకటన హక్కు పరిధిలోకి వస్తుందని.. దీన్ని గుర్తించడంలో హైకోర్ట్ విఫలమైందని పిటిషన్ లో పేర్కొంది. కర్ణాటక విద్యాచట్టం 1983లో విద్యార్థులు తప్పనిసరిగా ధరించాల్సిన యూనిఫాం గురించి తెలపలేదని పిటిషన్ లో ప్రస్తావించారు. 

ఇదిలా ఉంటే కర్ణాటక హైకోర్ట్ మంగళవారం హిజాబ్ వివాదంపై కీలక తీర్పు వెల్లడించింది. హిజాబ్ అనేది ముస్లిం మతంలో తప్పనిసరి ఆచారం కాదని తీర్పు ఇస్తూనే… విద్యా సంస్థల్లో యూనిఫామ్ ఖచ్చితంగా ధరించాల్సిందే అంటూ తీర్పు ఇచ్చింది. విద్యాలయాల్లో ప్రోటోకాల్స్ తప్పనిసరి పాటించాల్సిందే అంటూ కర్ణాటక హైకోర్ట్ పేర్కొంది. జస్టిస్ రితూ రాజ్ అవస్థితో కూడిన ధర్మాసనం తీర్పును వెల్లడించింది. ఈ తీర్పును బీజేపీ వర్గాలు స్వాగతించగా… కాంగ్రెస్ తో పాటు మరికొన్ని పార్టీలు తీర్పును వ్యతిరేఖిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version