hijab row: కర్ణాటక హైకోర్ట్ లో నేడు హిజాబ్ పై విచారణ. కోర్ట్ ఆదేశాలపై ఉత్కంఠ

-

కర్ణాటకలో మొదలైన ‘హిజాబ్’ వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఓ వర్గం విద్యార్థులు హిజాబ్ ధరించి విద్యాలయాలకు రావడాన్ని మరో వర్గం విద్యార్థులు అభ్యంతరం చెప్పడం.. వారు కాషాయ కండువాలు ధరించి విద్యాలయాలకు రావడం ఉద్రిక్తతలకు కారణమైంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ అంశం ప్రస్తుతం రాజకీయం అయింది. రాజకీయ పార్టీలు హిజాబ్ మద్దుతుగా.. వ్యతిరేఖంగా వ్యాఖ్యానిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ అంశం కర్ణాటక హైకోర్ట్ పరిధిలో ఉంది. తాజాగా మరోసారి హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్ట్ విచారించనుంది. హైకోర్ట్ ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో అని అందరిలో ఉత్కంఠ ఉంది. గత వారం విచారణ సందర్భంగా కోర్ట్.. ఎలాంటి మతపరమైన వేషధారణతో విద్యాాలయాలకు రావద్దంటూ.. మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. ఈనెల 14 నుంచి విద్యాలయాలను ఓపెన్ చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉంటే కర్ణాటక ప్రభుత్వం.. ఉడిపి జిల్లాలో ఈనెల 14 నుంచి 19 వరకు 144 సెక్షన్ విధించింది. ఈ జిల్లాలోనే హిజాబ్ వివాదం ప్రారంభం అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version