ఏపీలోని అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం వద్ద దొరికిన గుర్తు తెలియని మృతదేహాన్ని హిజ్రాదిగా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. బయ్యవరం వద్ద మొండెం, ఒక చేయి దొరకగా బుధవారం ఉదయం డైట్ కాలేజీ సమీపంలో తల, చెయ్యి భాగాలను పోలీసులు గుర్తించారు.
చనిపోయిన హిజ్రాను దీపికగా గుర్తించారు.గత కొంతకాలంగా ఒక వ్యక్తితో మునగపాక మండలం నాగులపల్లిలో ఆమె సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.ఈ కేసులో నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితుడు బన్నీని తమకు అప్పగించాలని హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఏరియా ఆస్పత్రి వద్ద వారు ధర్నాకు దిగారు. అరెస్టులు, కోర్టుల కేసుల వలన తక్షణ న్యాయం జరగదని, నిందితుడిని తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.