మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో ఓ యువకుడు హిజ్రాను వేధిస్తున్నట్లు సమాచారం. దీంతో బాధిత హిజ్రా మరికొందరితో కలిసి సదరు యువకుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.
మందమర్రిలో వినయ్ అనే యువకుడు గత కొంతకాలంగా తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు హిజ్రా ఆరోపించింది. తనను పెళ్లి చేసుకోవాలని లేకపోతే రైలు కింద పడి చనిపోతానంటూ యువకుడు బెదిరిస్తున్నాడని వెల్లడించింది. దీంంతో వినయ్ ఇంటి ముందు హిజ్రా ధర్నాకు దిగింది. తమ జోలికి రాకుండా ఉండాలని మరికొందరితో కలిసి డిమాండ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.