దేశప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. కొద్ది రోజుల కిందట సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ మోడీని కలిసినప్పుడు సౌదీలో పర్యటించాలని కోరారు. దీంతో 2025 ఏప్రిల్ 22-23 తేదీల్లో సౌదీ పర్యటనకు మోడీ బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధన భద్రత, రక్షణ, మరియు ద్వైపాక్షిక సహకారం వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
2024 డిసెంబర్ నెలలో సౌదీ ప్రిన్స్ ఆహ్వానం మేరకు ప్రధాని అక్కడకు వెళ్లాల్సి ఉండగా..షెడ్యూల్ కుదరలేదు. తాజాగా షెడ్యూల్ ఖరారు కావడంతో ప్రధాని మోడీ సౌదీలో పర్యటించనున్నారు.ఈ సందర్శన భారత్-సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) వంటి ప్రాజెక్టు కొలిక్కి రానుందని సమాచారం.