ప్రపంచ దేశాలకు చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తునే ఉంది. మూడు నెలలకోకసారి రూపాంతరం చెందుతూ… ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో… శాస్త్రవేత్తలు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని అల్లాడిస్తున్న కరోనా ను కట్టడి చేసే ఓ మొక్క హిమాలయాల్లో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
హిమాలయా ల్లోని రోడో డెండ్రాన్ అర్బోరియం అనే మొక్క పువ్వు లో కరోనా చికిత్స అత్యంత కీలకమైన ఫైటో కెమికల్స్ ఉన్నట్లు హిమాచల్ ప్రదేశ్ లోని మండీ ఇండియన్ ఇని స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ శాస్త్ర వేత్తలు కనుగొన్నారు. స్థానికంగా ఈ మొక్కను బురాన్ష్ అని పిలుస్తారు. ఇందులోని ఫైటో కెమికల్స్ కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. దీని పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.