HIT-2 నుంచి ఆ సీన్ రిలీజ్.. మీరు చూశారా..?

-

‘హిట్ 2’ సినిమా విడుదలై థియేటర్​లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. థ్రిల్లర్ జానర్​లో రిలీజ్ అయిన ఈ మూవీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కలెక్షన్లలో కూడా ఈ సినిమా దూసుకెళ్తోంది. ఈ మూవీ హిట్​తో అడివి శేష్ తన కెరీర్​లోనే డబుల్ హ్యాట్రిక్ కొట్టిన హీరోగా నిలిచిపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ ఘనత దక్కించుకున్న ఏకైక హీరో అడివి శేష్.

డిసెంబర్ 17న అడివి శేష్ పుట్టిన రోజు. ఆయన బర్త్ డే సందర్భంగా హిట్-2 మూవీ టీమ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఆ సినిమాలోని హీరో ఇంట్రడక్షన్ సీన్​ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్​లో హల్​చల్​ చేస్తోంది. ‘హిట్ 2’ సినిమాలో వచ్చే మొదటి సీన్ కూడా ఇదే. ఇందులో అడివిశేష్ వైజాగ్ ఎస్పీ కృష్ణ దేవ్(కె డి)గా కనిపిస్తాడు. ఈ ప్రారంభ సీన్​లో ఆయన ఓ హత్య కేసును చేధిస్తాడు.

ఓ వ్యక్తి తన తమ్ముడిని హత్య చేసి ఎవరికీ తెలియకుండా బీచ్​లో పడేస్తాడు. ఆ విషయం ఎస్పీకి తెలియడంతో క్రైమ్ సీన్​కు చేరుకుంటాడు. ఈ హత్య కేసును కొన్ని క్షణాల్లో చేధించి, హత్య చేసింది అతని అన్నయ్యేనని ప్రూవ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేస్తాడు. అయితే తర్వాత మీడియాతో మాట్లాడుతూ జనరల్​గా ఇలాంటి హంతకులది కోడి బుర్రలు, వీళ్లను పట్టుకోవడానికి 5 నిమిషాలు చాలు అని అంటాడు. ఇక్కడ నుంచే సినిమా అసలు కథ మొదలవుతుంది. ఈ సీన్ ప్రేక్షకులను సినిమాలోకి తీసుకువెళ్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version