కెప్టెన్సీపై హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం

-

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 4-1 తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో డబ్య్లూటీసీ చాంపియన్ షిప్ టోర్నీకి అర్హత కూడా సాధించలేకపోయింది. ఈ టోర్నీలో దిగ్గజ ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ ఆటతీరుతో ఫ్యాన్స్‌ను చాలా నిరాశ పరిచారు.దీంతో రోహిత్ శర్మ తన కెప్టెన్సీని వదిలేయాలని చాలా మంది వ్యాఖ్యానించారు.

Rohit Sharma Retirement Date

దీనిపై ఆలస్యంగా స్పందించిన రోహిత్ శర్మ కెప్టెన్సీని వదులుకోనని ప్రకటించారు. కానీ, టీమిండియాకు కొత్త సారథిని వెతకాలని బీసీసీఐకి రోహిత్ శర్మ చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి. సీటీ -25 సహా మరికొన్ని నెలలు తననే కొనసాగించాలని కోరినట్లు సమాచారం. జట్టు ప్రదర్శనపై శనివారం బోర్డు సమీక్షలో హిట్ మ్యాన్, కోచ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తమ అభిప్రాయాలు చెప్పారు. బుమ్రాకు నాయకత్వం ఇచ్చేందుకు కొందురు విముఖత చూపినట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news