AP: మున్సిపాలిటీలకు ఫుల్‌ పవర్స్‌…భవన నిర్మాణాలు, లే అవుట్ లకు అనుమతులు కూడా !

-

AP: మున్సిపాలిటీలకు ఫుల్‌ పవర్స్‌ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. భవన నిర్మాణాలు, లే అవుట్ లకు అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ల నుంచి మున్సిపాలిటీలు,కార్పొరేషన్లు,నగర పంచాయతీలు,గ్రామ పంచాయతీలకు అధికారాల బదలాయింపులు చేసింది చంద్రబాబు సర్కార్‌.

Government orders handing over permissions for building constructions and layouts to municipalities

పాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో సవరించినట్లు జీవో లో వెల్లడించింది. ఇకపై అన్ని రకాల భవనాలకు మున్సిపాలిటీలు,కార్పొరేషన్లు అనుమతులు జారీ చేసింది. నగర పంచాయతీల్లో మూడెకరాలు దాటితే డీటీసీపీ అనుమతి తప్పనిసరి చేసింది. గ్రామ పంచాయతీలు 300 చ.మీ,10 మీటర్ల ఎత్తు వరకూ అనుమతులు మంజూరు చేయనున్నారు. అనధికారిక కట్టడాలపై మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీలు చర్యలు తీసుకునేలా అధికారాలు బదలాయింపులు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news