ఈ మధ్య కాలం లో ప్రతీ ఒక్కరు భవిష్యత్తు లో సమస్యలు ఏమి లేకుండా ఉండాలని చూస్తున్నారు. అలానే సొంత ఇంటి కలని నెరవేర్చుకోవాలని కూడా చూస్తున్నారు. డబ్బు పోగు చేసుకుని ఇల్లు, ప్లాట్ లేదా ఇతర ప్రాపర్టీలని చాలా మంది కొంటున్నారు. ఇళ్ళని కొనేందుకు హోమ్ లోన్ ని చాలా మంది తీసుకుంటూ వుంటారు.
వివిధ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు హోమ్ లోన్స్ అందిస్తున్నాయి. ఇలా కనుక లోన్ తీసుకుని మనం కొనుక్కుంటే త్వరగా కొనుక్కోవచ్చు. లోన్ కట్టుకుంటూ ఉంటాము. అయితే కొన్ని సంస్థలు మహిళలకు తక్కువ వడ్డీ తో ఈ లోన్లు అందించడంతో పాటు వీటిపై మరిన్ని బెనిఫిట్స్ అందిస్తున్నాయి. ఇక మరి వాటి కోసమే మనం ఇప్పుడు చూసేద్దాం.
పంజాబ్ నేషనల్ బ్యాంక్:
జీతం తీసుకునే మహిళలు, వ్యాపారవేత్తలు లేదా గృహిణులకు ఈ హోమ్ లోన్ సహాయంగా ఉంటుంది. 0.05 శాతం తక్కువ వడ్డీకి వారికి లోన్ వస్తుంది. గృహోపకరణాల ఖర్చు గరిష్టంగా రూ.25 లక్షల వరకు హౌసింగ్ లోన్‌లో 10 శాతం వరకు చేర్చుకోవచ్చు.
కెనరా బ్యాంక్:
కెనరా బ్యాంక్ కూడా హోమ్ లోన్‌ల పై మహిళలకు ఈ సేవలని అందిస్తోంది. 5 బేసిస్ పాయింట్ల డిస్కౌంట్ వస్తుంది. హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.85 శాతం నుంచి స్టార్ట్ అవుతుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
0.05 శాతం డిస్కౌంట్‌ను మహిళలకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తోంది. హోమ్ లోన్ తీసుకోవాలంటే మహిళలు ఇక్కడ కూడా తీసుకోవచ్చు.
హెచ్‌డీఎఫ్‌సీ:
మహిళలకు హోమ్ లోన్‌లపై 5 బేసిస్ పాయింట్ల డిస్కౌంట్ ని ఈ బ్యాంకు కూడా ఇస్తోంది. వడ్డీ రేటు 8.95 శాతం నుంచి ప్రారంభమవుతుంది. క్రెడిట్ స్కోర్ లోన్ మొత్తాన్ని బట్టి 9.85 శాతం దాకా వుండే ఛాన్స్ వుంది.