naini rajendhar reddy hot comments on teenmar mallanna: తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవచ్చు అంటూ హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎమ్యెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్యెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తాజాగా మీడియా తో మాట్లాడుతూ ఇష్టం లేకుంటే తీన్మార్ మల్లన్న పార్టీ నుండి వెళ్లిపోవచ్చు అని ఫైర్ అయ్యారు.
తీన్మార్ మల్లన్నకు ఆయన కులం గురించి మాట్లాడే హక్కు ఉందన పేర్కొన్నారు. ఇతర కులాలను తిట్టే హక్కు మాత్రం లేదని మండిపడ్డారు నాయిని రాజేందర్ రెడ్డి. ఆయనకు ఇష్టం లేకుంటే పార్టీ నుంచి బయటికెళ్లి మాట్లాడుకోవచ్చు. ఆనాడు మేము రెడ్లు అని గుర్తు లేదా? అని నిలదీశారు నాయిని రాజేందర్ రెడ్డి. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా నిర్వహించిన కుల గణన సర్వేను… తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తీన్మార్ మల్లన్న. ఆ కుల గణన రిపోర్టును మీడియా వేదికగా… కాల్చివేసి రచ్చ చేశారు తీన్మార్ మల్లన్న. దీంతో అతనిపై వేటువేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్… చేస్తున్నారు.