హైదరాబాద్ టు తిరుపతి వెళ్ళే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నాలుగు గంటలుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 5:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఇప్పటికీ కదలలేదు.
ఈ విషయాన్ని ప్రయాణికులకు చివరి నిమిషంలో అధికారులు సమాచారం ఇచ్చారు.దీంతో అధికారుల తీరు పట్ల ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమానంలో సాంకేతిక సమస్య ఉన్నప్పుడు ముందుగా సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఎయిర్ పోర్టు అథారిటీని వారు ప్రశ్నించినట్లు సమాచారం. ఇంక ఎంతసేపు ఇలా వెయిట్ చేయిస్తారని అధికారుల తీరుపై ప్యాసింజర్స్ సీరియస్ అయ్యారు.